Yograj Singh : యువరాజ్ సింగ్..! భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో అత్యుత్తమమైన ఆటగాడు. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత ఆ లోటును ఇప్పటివరకు మరే ఆటగాడు కూడా పూడ్చలేదు. 2011లో భారత్ ప్రపంచకప్ గెలువడంలో యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఆద్యంతం అద్భుతమైన ప్రదర్శన చేసిన యువరాజ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
అయితే 2011 ప్రపంచకప్ తర్వాత యువరాజ్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. అనంతరం యువరాజ్ క్యాన్సర్ నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చినా అంతకుముందు స్థాయి ఆటతీరును కనబర్చలేకపోయాడు. చివరికి 2019లో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినా 2007 టీ20 ప్రపంచకప్‌లో, 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ప్రదర్శనను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.
ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఓ ఛానెల్ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు యువరాజ్ సింగ్ చనిపోయినా తాను గర్వించే వాడినని వ్యాఖ్యానించారు. ‘భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు యువరాజ్ సింగ్ క్యాన్సర్ కారణంగా మరణించినా తాను ఒక తండ్రిగా గర్వించేవాడిని. ఇప్పటికీ నా కొడుకు నాకు గర్వకారణం. ఈ విషయాన్ని నేను యువరాజ్‌కు ఫోన్లో కూడా చెప్పా. అతను రక్తం కక్కుతున్నా కూడా దేశం కోసం ఆడాలనే కోరుకున్నా. ‘బాధపడొద్దు. నువ్వేం చనిపోవు. దేశం కోసం ఈ ప్రపంచకప్ గెలువాలి’ అని 2011 వరల్డ్‌కప్ సందర్భంగా యువరాజ్‌కు చెప్పా’ అని యోగ్రాజ్ తెలిపారు.
అయితే భారత క్రికెట్ జట్టుకు అత్యుత్తమ ఫినిషర్‌గా యువరాజ్ సింగ్ చెరగని ముద్రవేసినా.. అతడు తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడని యోగ్రాజ్ సింగ్ అన్నారు. యువరాజ్ సింగ్ తన తండ్రి మాదిరిగా 10 శాతం పనిచేసినా ఇంకా గొప్ప క్రికెటర్ అయ్యేవాడని వ్యాఖ్యానించాడు.
RN Ravi | ఇంత దురహంకారం మంచిది కాదు.. తమిళనాడు సీఎంపై గవర్నర్ కామెంట్స్
Cash Transactions | నగదు లావాదేవీలను తగ్గించండి.. లేదంటే జేబుకు చిల్లే..!
Kite festival | రంగురంగుల పతంగులు.. రకరకాల డిజైన్లు.. అలరించిన కైట్ ఫెస్టివల్
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!