IND vs AFG : మూడో వన్డేలోనూ భారత జట్టకు భారీ విజయం దక్కింది. నామమాత్రమైన మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలనుకున్న అఫ్గనిస్థాన్ ఆశల్ని ప్రసిధ్ కృష్ణ(5-23), యశస్వీ జైస్వాల్(110 నాటౌట్) ఆవిరి చేశారు. 219 పరుగుల ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(79)తో శతక భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వీ.. 50 ఓవర్ల ఫార్మాట్లో రెండో సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా 28.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్న టీమిండియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
వన్డే సారథిగా శుభ్‌మన్ గిల్ తొలి సిరీస్ సాధించాడు. చెపాక్ స్టేడియంలో అఫ్గనిస్థాన్‌ను 218కే కట్టడి చేసిన భారత్ స్వల్ప లక్ష్యాన్ని 28.4 ఓవర్లలోనే ఉఫ్‌మనిపించింది. పెనాల్టీగా లభించిన ఐదు పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించిని టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(79), యశస్వీ జైస్వాల్(1110 నాటౌట్)లు అదిరే ఆరంభమిచ్చారు.
📸📸
Hang it in the Louvre, Yashasvi Jaiswal 🖼️
Scorecard ▶️ https://t.co/kHgF4bqTg3#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/yOk8wWUmJr
— BCCI (@BCCI) June 20, 2026
కాబూలీ బౌలర్లను ఎడాపెడా బాదేసిన ఇద్దరూ స్కోర్ బోర్డును ఉరికించారు. చితక్కొడుతున్న ఈ ద్వయాన్ని విడదీసే మార్గం తెలియక అఫ్గన్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యంతో భారత్‌ను విజయానికి చేరువ చేసిన ఈ ద్వయాన్ని నబీ విడదీశాడు. రోహిత్ ఔటైనా జోరు తగ్గించని యశస్వీ 29వ ఓవర్లో తొలి బంతిని స్టాండ్స్‌లోకి పంపి వన్డేల్లో రెండోసారి మూడంకెల స్కోరందుకున్నాడు. ఆ తర్వాత 4, సిక్సర్ బాదిన యశస్వీ.. శ్రేయస్ అయ్యర్(20 నాటౌట్)తో కలిసి గిల్ సేనకు 9 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు.
Commanding. Clinical. Clean sweep 🔥#TeamIndia seal a 3⃣-0⃣ series victory with an excellent run chase in Chennai 🥳
Scorecard ▶️ https://t.co/kHgF4bqTg3#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/TTcROLncgN
— BCCI (@BCCI) June 20, 2026
తొలి రెండు వన్డేల్లో తేలిపోయిన అఫ్గనిస్థాన్ బ్యాటర్లు మూడో మ్యాచ్‌లోనూ తడబడ్డారు. ఆరంభంలోనే టాపార్డర్‌ను ప్రసిధ్ కృష్ణ(5-23) పెవిలియన్ చేర్చి కాబూలీ టీమ్‌ను హడలెత్తించాడు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా హష్మతుల్లా షాహిదీ(102) ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్(50)తో కలిసి దంచేసిన షాహిదీ వన్డేల్లో తొలి శతకంతో రెచ్చిపోయాడు. షాహిదీతో కలిసి స్కోర్ బోర్డును నడిపిస్తున్న అజ్మతుల్లాను ప్రిన్స్ యాదవ్ ఔట్ చేయడంతో.. మొహమ్మద్ నబీ(21) కాసేపు పోరాడాడు.
హష్మతుల్లా షాహిదీ(102)

కానీ, అతడిని గుర్నూర్ బ్రార్ బౌల్డ్ చేసి ఆరో వికెట్ అందించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా షాహిదీ మాత్రం జోరు తగ్గించలేదు. వాషింగ్టన్ సుందర్ వేసిన 44వ ఓవర్లో బౌండరీతో ఈ కుర్రాడు తొలి శతకం అందుకున్నాడు. సెంచరీ బాదిన షాహిదీని ఔట్ చేసిన ప్రసిధ్ ఐదో వికెట్ ఖాతాలో వేసుకోగా.. 45వ ఓవర్లోనే అఫ్గనిస్థాన్ 218 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బ్రార్, హర్ష్ దూబే చెరొక వికెట్ తీశారు.