RCB vs RR : పదిహేడో సీజన్ ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జయభేరి మోగించింది. లీగ్ దశలో వరుస ఓటముల నుంచి తేరుకొని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)కు భారీ షాకిచ్చింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(45), రియాన్ పరాగ్(35)లు విధ్వంసంక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో ఇంప్యాక్ట్ ప్లేయర్ షిమ్రన్ హెట్‌మైర్(26), రొవ్మన్ పావెల్(16 నాటౌట్) లు ధనాధన్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దాంతో, సంజూసేన క్వాలిఫయర్ 2కు దూసుకెళ్లగా.. ఈసారైనా టైటిల్ గెలవాలనుకున్న ఆర్సీబీ ఆశలు అడియాశలయ్యాయి.
అహ్మదాబాద్ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు బెంగళూరు టాపార్డర్‌కు కళ్లెం వేశారు. అనంతరం 173 పరుగుల ఛేదనకు దిగిన సంజూ సేన 46 వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయినా యశస్వీ జైస్వాల్(45) తన మార్క్ షాట్లతో బౌంబరీలు బాదేశాడు. హాఫ్ సెంచరీకి చేరవైన అతడని గ్రీన్ వెనక్కి పంపాడు. ఆ కాసేటికే కెప్టెన్ సంజూ శాంసన్ (17) వైడ్ బంతిని ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. 86 వద్ద న్ మూడో వికెట్ పడిన రాజస్థాన్‌ను రియాన్ పరాగ్(35), ధ్రువ్ జురెల్(8)లు ఆదుకున్నారు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్‌కు 25 రన్స్ జోడించారు.
Thank you for setting the tone, Yash. 🙌 pic.twitter.com/fCebbuahZu
— Rajasthan Royals (@rajasthanroyals) May 22, 2024
పరాగ్‌తో భారీ భాగస్వామ్యం నెలకొల్పానే ఆలోచనతో ఉన్న జురెల్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. రెండో రన్ తీసే ప్రయత్నంలో ఉన్న అతడిని కోహ్లీ విసిరిన మెరపు త్రోను అందుకున్న గ్రీన్ రనౌట్ చేశాడు. అప్పటికీ రాజస్థాన్ స్కోర్ 112. ఇక ఆ తర్వాత ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షిమ్రాన్ హిట్మైర్(), పరాగ్‌తో కలిసి చెలరేగాడు. ఈఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో ఆర్సీబీ బౌలర్లు నీరుగారిపోయారు.
WATCH OUT for that rocket throw from Virat Kohli! 🚀#RR are 4 down now!
Dhruv Jurel departs and that brings a timely wicket for #RCB 👌👌
Follow the Match ▶️ https://t.co/b5YGTn7pOL #TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/BradGrJ9KA
— IndianPremierLeague (@IPL) May 22, 2024
ఐదో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని సిరాజ్ విడదీశాడు. ఒకే ఓవర్లో పరాగ్, హెట్మైర్ను ఔట్ చేసి బెంగళూరులో విజయావశాకాల్ని చిగురింపచేశాడు. అప్పటికి రాజస్థాన్ విజయానికి 13 బంతుల్లో 12రన్స్ కావాలంతే. కానీ, రొవ్మన్ పావెల్(16 నాటౌట్).. ఫెర్గూసన్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, సిక్సర్‌తో బెంగళూరును ఇంటికి పంపాడు.
తాడోపేడో తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల విజృంభణతో టాపార్డర్ చేతులెత్తేసింది. అవేశ్ ఖాన్(344), అశ్విన్(219)లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 రన్స్‌కే పరిమితమైంది.
Four overs to go!
Mahipal Lomror & Dinesh Karthik aim to finish on a high 🔥
Follow the Match ▶️ https://t.co/b5YGTn7pOL#TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/EVdq53rI8U
— IndianPremierLeague (@IPL) May 22, 2024
ఓపెనింగ్ జోడీ విరాట్ కోహ్లీ(33), ఫాఫ్ డూప్లెసిస్(17)లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరిన వేళ.. రజత్ పాటిదార్(34), మహిపాల్ లొమ్రోర్(32)లు బాధ్యతగా ఆడారు. ఈ ఇద్దరి విధ్వంసంతో ఆర్సీబీ భారీ స్కోర్ కొడుతుందనిపించింది. కానీ, చివర్లో దినేశ్ కార్తిక్(11) ఇంప్యాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్(9 నాటౌట్) బ్యాటింగ్ మెరపులతో ఆర్సీబీ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.