Yashasvi Jaiswal | ఇంగ్లండ్‌పై సెంచరీల మోత.. బ్రాడ్‌మన్, గవాస్కర్ల సరసన యశస్వీ
Yashasvi Jaiswal : ఇంగ్లండ్ సిరీస్‌లో దంచికొడుతున్న భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. వరుసగా రెండో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన యశస్వీ.. ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులతో క్రికెట్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, డాన్ బ్రాడ్‌మన్...
Yashasvi Jaiswal : ఇంగ్లండ్ సిరీస్‌లో దంచికొడుతున్న భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. వరుసగా రెండో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన యశస్వీ.. రాంచీ టెస్టు(Ranchi Test)లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా 73 పరుగులతో రాణించి ఈ సిరీస్‌లో 600 పరుగుల మార్క్ దాటాడు. తద్వారా ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులతో క్రికెట్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, డాన్ బ్రాడ్‌మన్ సరసన నిలిచాడు.
ఒకే టెస్టు సిరీస్‌లో ఆరొందలకు పైగా రన్స్ కొట్టిన సునీల్ గవాస్కర్(Sunil Gavaskar), గ్రేమ్ స్మిత్, జార్జ్ హెడ్లే, నీల్ హర్వేతో కూడిన ఎలైట్ క్లబ్(Elite Club)లో చోటు దక్కించుకున్నాడు. క్రికెట్ లెజెండ్ బ్రాడ్‌మన్ 1930లో ఇంగ్లండ్‌పై ఓ రేంజ్లో చెలరేగాడు. వీరబాదుడు బాదిన అతడు ఏకంగా 974 రన్స్ కొట్టాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ గ్యారీ సోబర్స్ రెండో స్థానంలో నిలిచాడు. 1957-58 మధ్య పాకిస్థాన్‌పై 824 పరుగులు బాదాడు. భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ 1970-71లో వెస్టిండీస్‌పై 774 రన్స్ కొట్టి థర్డ్ ప్లేస్ సంపాదించాడు.
సునీల్ గవాస్కర్, గ్రేమ్ స్మిత్

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 2003లో ఇంగ్లండ్‌పై 714 రన్స్ బాదాడు. జార్జ్ హెడ్లే ఇంగ్లండ్‌పై 703 పరుగులతో ఐదో స్థానంలో నిలవగా.. నీల్ హర్వే(Neil Harvey) దక్షిణాఫ్రికాపై 660 రన్స్ సాధించాడు. యశస్వీ 618 పరుగులతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ ముగిసే లోపు అతడు టాప్-4లోకి దూసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.

రంజీ ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రదర్శనతో టీమిండియా జెర్సీ వేసుకున్న యశస్వీ పరుగుల వరద పారిస్తున్నాడు. నిరుడు టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వీ.. ఇప్పటివరకూ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 103 సగటుతో 618 రన్స్ కొట్టాడు. కెరీర్ మొదలెట్టిన కొన్ని రోజుల్లోనే ఈ యంగ్‌స్టర్ 2 సెంచరీలు, రెండు ఫిఫ్టీలు సాధించి భారత భావితారగా ప్రశంసలు అందుకుంటున్నాడు. బలమైన ఫుట్‌వర్క్, షాట్ సెలెక్షన్లో కచ్చితత్వం, అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదగల నైపుణ్యంతో యశస్వీ భారత క్రికెట్‌కు తరగని ఆస్తిలా మారుతున్నాడు.
ఇవి కూడా చదవండి
- Bull Enters Hospital | ఆసుపత్రి వార్డులోకి ఎద్దు.. భయాందోళన చెందిన రోగులు
- PM Modi | బంధుప్రీతి, అవినీతిలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ: ప్రధాని మోదీ
- Minister Ambati | పల్లకి మోయడం కంటే విలీనం బెటర్.. పవన్‌కల్యాణ్‌కు మంత్రి అంబటి హితబోధ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

