Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ.. 4 వికెట్లు తీసిన హసన్
Yashasvi Jaiswal: బంగ్లాతో టెస్టులో జైస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో అతనికి ఇది అయిదవది. చెన్నై టెస్టులో ఇండియా ప్రస్తుతం 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 రన్స్ చేసింది.
చెన్నై: యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఒకవైపు టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిష్క్రమిస్తున్నా.. అతను మాత్రం క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో.. జైస్వాల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 98 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో జైస్వాల్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. భోజన విరామ సమయం తర్వాత .. జైస్వాల్ తన ఖాతాలో హాఫ్ సెంచరీ వేసుకున్నాడు. టెస్టుల్లో అతినికి ఇది 5వ హాఫ్ సెంచరీ. లంచ్‌కు ముందు 3 వికెట్లు కోల్పోయి 88 రన్స్ చేసిన భారత్.. ఆ తర్వాత కీలకమైన పంత్ వికెట్‌ను కోల్పోయింది. పంత్ 39 రన్స్ స్కోర్ చేసి ఔటయ్యాడు. బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం 36 ఓవర్లలో ఇండియా 4 వికెట్ల నష్టానికి 132 రన్స్ చేసింది. జైస్వాల్ 50, రాహుల్ 10 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
FIFTY!@ybj_19 with a solid half-century. His 5th in Test cricket 👏👏
Live – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/mKIJbBKYHm
— BCCI (@BCCI) September 19, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

