బెంగుళూరు: సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియాకప్(Asia Cup) వన్డే క్రికెట్ టోర్నీ కోసం టీమిండియా జట్టును ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 19 లేదా 20వ తేదీన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత బృందాన్ని ప్రకటించనున్నది. అయితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ సైన్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా సెలక్షన్ కమిటీ వన్డే జట్టును ప్రకటిస్తుంది. ప్రస్తుతం వన్డే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా బెంగుళూరులోని అకాడమీలోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. టాప్ ఫైవ్ బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉండే అవకాశాలు ఉన్నాయి.
టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అభిషేక్ శర్మ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు. గత సీజన్లో సంజూ శాంసన్ కూడా ఉత్తమ పర్ఫార్మెన్ష్ ఇచ్చాడు. టెస్టుల్లో టాప్ ఫామ్‌లో ఉన్న శుభమన్ గిల్‌ను కూడా పక్కన పెట్టే పరిస్థితి లేదు. అయితే టాప్ ఆర్డర్లో మేటి పర్ఫార్మర్లు ఉన్న నేపథ్యంలో.. సెలెక్టర్లకు ఇప్పడు సమస్యగా మారే అవకాశం ఉన్నది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ లాంటి బ్యాటర్లకు వన్డే జట్టులో చోటు దొరకడం డౌట్‌గా కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ కూడా వన్డేల్లో కీపర్‌గా ప్లేస్ సంపాదించడం కష్టమే. ఎందుకంటే అతను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే పరిస్థితి లేదు.
ఫస్ట్ కీపర్ ఛాయిస్‌లో సంజూ శాంసన్ ఉన్నాడు. ఇక సెకండ్ కీపర్ స్థానంలో జితేశ్ శర్మ, ద్రువ్ జురెల్ ఉన్నారు. ఆ ఇద్దరు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్ పాత్రలో హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఛాయిస్‌గా ఉన్నాడు. ఇక ప్రస్తుతం గాయంతో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కకపోవచ్చు. శివం దూబేకు కూడా చోటు దక్కే అవకావం ఉన్నది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉన్నారు. స్పీడ్ బౌలర్లలో బుమ్రా, అర్షదీప్ తమ స్థానాలను ఫిక్స్ చేసుకున్నారు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ.. హర్షిత్ రాణా మరో స్థానం కోసం పోటీపడనున్నారు.
ఆసియా కప్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది.