IPL 2025 : లక్నో నిర్దేశించిన భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు దంచేశారు. యశస్వీ జైస్వాల్(55 నాటౌట్) అర్థ శతకంతో చెలరేగాడు. ఈ సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. ఇక. 14 ఏళ్లకే అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ(34)సైతం దూకుడుగా ఆడాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన ఈ కుర్రాడు.. ఆపై అవేశ్ ఖాన్ ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు.
మొదట మ్యాచ్‌లోనే ఫిఫ్టీ కొట్టేలా కనిపించిన ఈ చిచ్చరపిడుగు అనూహ్యంగా మర్క్రమ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దాంతో, అతడి విధ్వంసక ఇన్నింగ్స్‌కు.. 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే నితీశ్ రానా(8)ను యశ్ ఠాకూర్ పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం కెప్టెన్ రియాన్ పరాగ్ (15) ఆడుతున్నాడు. 12 ఓవర్లకు స్కోర్.. 113-2. ఇంకా రాజస్థాన్ విజయానికి 68 రన్స్ కావాలి.
No mercy for the ball when the batter is Yashasvi Jaiswal 👊
A stylish 5️⃣0️⃣* from him keeps #RR in control with 83/0 after 8.1 overs.
Updates ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/BZZD2T2U7A
— IndianPremierLeague (@IPL) April 19, 2025