IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న పొట్టి సిరీస్ డిసైడర్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(57) హాఫ్ సెంచరీ బాదాడు. విలియమ్స్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీకి చేరువయ్యాడు. 29 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో యశస్వీ.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(35)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొప్పాడు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు పరుగులు 79 జోడించారు. 11 ఓవర్లకు స్కోర్..108/2
వాండరర్స్లోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ తీసుకుంది. తొలి ఓవర్లోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(12) మూడు ఫోర్లు బాదాడు. అయితే.. కేశవ్ మహారాజ్ తన మొదటి ఓవర్లోనే వరుస బంతుల్లో డేంజరస్ గిల్, తిలక్ వర్మ(0)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత యశస్వీ, సూర్య ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.