IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ డబుల్ హెడర్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు సమిష్టిగా దంచేశారు ఓపెనర్ యశస్వీ జైస్వాల్(67) ఈ సీజన్లో తొలి అర్ద శతకంతో గర్జించగా.. రయాన్ పరాగ్(42), కెప్టెన్ సంజూ శాంసన్(38)లు రాణించారు. శాంసన్‌తో 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వీ జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశాడు. వీళ్లిద్దరు ఔటయ్యాక రియాన్ పరాగ్(43 నాటౌట్) విజృంభించాడు. స్టోయినిస్ వేసిన 20వ ఓవర్లో ఆఫ్‌సైడ్ సిక్సర్ బాదగా.. ధ్రువ్ జురెల్(13 నాటౌట్) బంతిని స్టాండ్స్‌లోకి పంపి స్కోర్ 200 దాటించాడు. దాంతో, రాజస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.
టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(67), సంజూ శాంసన్(38)లు అదిరే ఆరంభమిచ్చారు. పవర్ ప్లేలో ఇద్దరూ బౌండరీలతో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఉతికారేశారు. దాంతో, రాజస్థాన్ వికెట్ కోల్పోకుండా 53 రన్స్ కొట్టింది. శతక భాగస్వామ్యం నెలకొల్పే దిశగా సాగుతున్న ఈ జోడీని లాకీ ఫెర్గూసన్ విడదీశాడు. శాంసన్ గాల్లోకి లేపిన బంతి నేరుగా శ్రేయాస్ అయ్యర్ చేతుల్లో పడింది. దాంతో, రాజస్థాన్ 89 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
Innings Break!
With a power-packed final push, #RR post the highest team total at this venue in #TATAIPL 🔥
Will #PBKS chase down a 🎯 of 206? 🤔
Scorecard ▶ https://t.co/kjdEJydDWe#PBKSvRR pic.twitter.com/P0WwRFfiTv
— IndianPremierLeague (@IPL) April 5, 2025
శాంసన్ ఔటయ్యాక.. రాజస్థాన్ స్కోర్ నెమ్మదించింది. ఆ కాసేపటికే 40 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన యశస్వీని ఫెర్గూసన్ బౌల్డ్ చేశాడు. 138 వద్ద రెండో వికెట్ పడడంతో జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్న రియాన్ పరాగ్ 43 నాటౌట్) చెలరేగి ఆడాడు. గత మ్యాచ్ విజేత నితీశ్ రానా(12) విఫలం కాగా.. షిమ్రాన్ హిట్మైర్ ఉన్నంత సేపు దంచాడు. 12 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 20 పరుగులు చేసిన అతడిని ఫుల్‌టాస్‌తో అర్ష్‌దీప్ బోల్తా కొట్టించాడు. స్టోయినిస్ వేసిన 20వ ఓవర్లో పరాగ్ సిక్సర్ కొట్టగా.. ధ్రువ్ జురెల్(13 నాటౌట్) సిక్స్, ఫోర్‌తో బాదడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
Finding his groove 🔝 😎
Yashasvi Jaiswal notched up his first 5️⃣0️⃣ of the season in style 🩷
He departs for a well-made 67(45).
Updates ▶ https://t.co/kjdEJydDWe#TATAIPL | #PBKSvRR | @ybj_19 pic.twitter.com/byXYSOKJ4o
— IndianPremierLeague (@IPL) April 5, 2025