IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) రెండో విజయం ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు విక్టరీలతో జోరుమీదున్న పంజాబ్ కింగ్స్(Punjba Kings)కు ఊహించని షాకిచ్చింది. యశస్వీ జైస్వాల్(63), రియాన్ పరాగ్(43 నాటౌట్) మెరుపులతో 205 రన్స్ కొట్టిన రాజస్థాన్ ప్రత్యర్థిని 155కే కట్టడి చేసింది. జోఫ్రా ఆర్చర్(3-25) నిప్పులు చెరగడంతో.. పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను నేహల్ వధేరా(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్(30) గెలుపు దిశగా నడిపారు. విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ ఈ ఇద్దరూ ఆశలు రేపారు. అయితే.. వరుస బంతుల్లో ఇద్దరినీ థీక్షణ, హసరంగలు పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి. దాంతో, 50 పరుగుల తేడాతో గెలుపొందిన సంజూ బృందం.. రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ 18వ సీజన్లో మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) గర్జించింది. ఆల్‌రౌండ్ షోతో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్లో ఓటమెరుగని పంజాబ్ కింగ్స్(Punjba Kings)ను సంజూ శాంసన్ సేన ఓడించింది. ఆరంభం నుంచి పట్టు బిగించిన రాజస్థాన్ 50 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 206 పరుగుల ఛేదనలో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(0)ను తొలి బంతికే ఆర్చర్ బౌల్డ్ చేశాడు. 140 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతి వికెట్లను గిరాటేసింది.
Halla 𝘉𝘰𝘸𝘭𝘦𝘥 x 2 🔥🔥 pic.twitter.com/U0uPu0zSd7
— Rajasthan Royals (@rajasthanroyals) April 5, 2025
ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్(10) రెండు ఫోర్లు బాదినా.. ఆఖరి బంతిని అంచనా వేయలేక క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ కాసేపటికే మార్కస్ స్టోయినిస్(1)ను స్లో బాల్‌తో బుట్టలో వేసుకున్నాడు సందీప్ అర్మ. అతడిని వెనక్కి పంపడంతో 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది పంజాబ్. అసలే పీకల్లోతు కష్టాల్లో పడిన ఆతిథ్య జట్టును ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కార్తిక్ త్యాగి మరింత దెబ్బకొట్టాడు. ప్రభ్‌సిమ్రన్ వికెట్ తీసి పంజాబ్‌ను .. అయితే.. టౌమ్ ఔట్ తర్వాత అతడు వేసిన 10వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ 6, 4 కొట్టగా.. వధేరా బౌండరీ సాధించాడు.
.@PunjabKingsIPL upping the ante 📈
Nehal Wadhera 🤝 Glenn Maxwell with a crucial 5⃣0⃣-run partnership🔥#PBKS 95/4 after 12 overs.
Updates ▶ https://t.co/kjdEJydDWe#TATAIPL | #PBKSvRR pic.twitter.com/lSgpnOXQ9c
— IndianPremierLeague (@IPL) April 5, 2025
హసరంగ వేసిన 14వ ఓవర్లో స్ట్రెయిట్ సిక్సర్‌తో వధేరా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా భారీ షాట్లతో 88 పరుగులు చేసిన ఈ జోడీని థీక్షణ విడదీశాడు. అతడి బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ సిక్సర్‌కు యత్నించగా.. బౌండరీ లైన్ వద్ద యశస్వీ చక్కని క్యాచ్ అందుకున్నాడు. అంతే.. పంజాబ్ ఆశలు ఆవిరి అయ్యాయి. ఆ మరుసటి ఓవర్లో హసరంగ డేంజరస్ వధేరను ఊరించే బంతి వేయగా.. జురెల్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టడంతో ఆరో వికెట్ కోల్పోయింది. అంతే.. పంజాబ్ ఓటమి అంచున నిలిచింది. థీక్షణ బౌలింగ్‌లో మార్కో యాన్సెస్(3) నేరుగా హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో, టెయిలెండర్ల అండతో జట్టును గెలిపించాలనుకున్న శశాంక్ సింగ్() కల నెరవేరలేదు.
టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(67), సంజూ శాంసన్(38)లు అదిరే ఆరంభమిచ్చారు. పవర్ ప్లేలో ఇద్దరూ బౌండరీలతో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఉతికారేశారు. దాంతో, రాజస్థాన్ వికెట్ కోల్పోకుండా 53 రన్స్ కొట్టింది. శతక భాగస్వామ్యం నెలకొల్పే దిశగా సాగుతున్న ఈ జోడీని లాకీ ఫెర్గూసన్ విడదీశాడు. శాంసన్ గాల్లోకి లేపిన బంతి నేరుగా శ్రేయాస్ అయ్యర్ చేతుల్లో పడింది. దాంతో, రాజస్థాన్ 89 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత రియాన్ పరాగ్(43 నాటౌట్) చెలరేగి ఆడాడు. గత మ్యాచ్ విజేత నితీశ్ రానా(12) విఫలం కాగా.. షిమ్రాన్ హిట్మైర్ ఉన్నంత సేపు దంచాడు. 12 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 20 పరుగులు చేసిన అతడిని ఫుల్‌టాస్‌తో అర్ష్‌దీప్ బోల్తా కొట్టించాడు. స్టోయినిస్ వేసిన 20వ ఓవర్లో పరాగ్ సిక్సర్ కొట్టగా.. ధ్రువ్ జురెల్(13 నాటౌట్) సిక్స్, ఫోర్‌తో బాదడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.