IND vs ENG : అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు (Oval Test)లో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్(73 నాటౌట్), నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప్(32 నాటౌట్) అండగా చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్ బౌల్‌లను దీటుగా ఎదుర్కొంటున్న ఈ యంగ్‌స్టర్ స్లిప్‌లో కళ్లు చెదిరే బౌండరీలతో వారెవా అనిపిస్తున్నాడు. దాంతో.. తొలి సెషన్లో వికెట్ తీసి ఒత్తిడి పెంచాలనుకున్న ఆతిథ్య జట్టు బౌలర్లను అసహనానికి గురి చేస్తూ ఆధిక్యాన్ని పెంచుతూ పోతోంది యశస్వీ, ఆకాశ్ ద్వయం. ప్రస్తుతానికి టీమిండియా స్కోర్. 127/2. గిల్ సేన 104 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓవర్ నైట్ స్కోర్ 75/2తో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించే దిశగా సాగుతోంది. రెండో రోజే మెరుపు బ్యాటింగ్‌తో అర్ధ శతకం బాదేసిన ఓపెనర్ యశస్వీ (73 నాటౌట్) మూడో రోజు అదే జోరు చూపిస్తున్నాడు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్(32 నాటౌట్) సైతం అనుభవం గల బ్యాటర్లా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు.
A valuable fifty-run partnership for the third wicket and a positive start to Day 3! 🙌
Yashasvi Jaiswal 🤝 Akash Deep#TeamIndia reach 121/2, lead by 98 runs
Updates ▶️ https://t.co/Tc2xpWNayE#ENGvIND pic.twitter.com/zEhTUZuatA
— BCCI (@BCCI) August 2, 2025
ఇంగ్లండ్ పేసర్ల ఎత్తుల్ని చిత్తు చేస్తూ యశస్వీ.. స్లిప్‌లో బంతిని బౌండరీ దాటిస్తుంటే ఫీల్డర్లు అయ్యో అని తల పట్టుకుంటున్నారు. ఇక.. జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ బౌన్సర్లు సంధిస్తున్నా.. ఆకాశ్ సమర్ధంగా ఆడుతూ యశస్వీకి చక్కని సహకారం అందిస్తున్నాడు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు ఫిఫ్టీ ప్లస్ రన్స్ జోడించారు.