John Cena : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) మాజీ చాంపియన్ జాన్ సేన(John Cena) హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్(WWE Super Star) పోటీల కోసం వచ్చిన ఈ స్టార్ రెజ్లర్‌కు ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు చేరుకున్నఅతడికి పూల దండలు వేసి ఆహ్వానించారు. జాన్ సేన భారత్‌లో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఆరేళ్ల తర్వాత మన దేశంలో జరుగుతున్న మొదటి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్(WWE Super Star) ఈవెంట్ ఇదే కావడం విశేషం.
డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలకు గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియం(Balayogi Indoor Stadium) ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆస్టన్ థియరీ(Austin Theory) ‘రెజిల్ మానియా’ పోటీలో జాన్ సేనను ఓడించాడు. దాంతో, ఈసారి అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని సేన కసితో ఉన్నాడు.
ఆస్ట్రేలియా రెజ్లర్ గ్రేసన్ వాలర్(Grayson Waller) కూడా సేనతో పోటీ పడేందుకు ఎదురు చూస్తున్నాడు. అంతేకాదు కెనడాకు చెందిన జిందర్ మహల్(Jinder Mahal) కూడా సేనతో అమీతుమీకి సిద్ధపడుతున్నాడు.