దుబాయ్: ఇంగ్లండ్ వేదికగా మరో నెల రోజుల వ్యవధిలో మొదలుకానున్న ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఈసారి జట్లకు అదిరిపోయే రీతిలో ప్రైజ్‌మనీ దక్కనుంది. వచ్చే నెల 11 నుంచి లార్డ్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ గురువారం ప్రైజ్‌మనీ ప్రకటించింది. ఈ ఏకైక టెస్టులో గెలిచిన జట్టుకు రూ.30.79 కోట్లు, రన్నరప్ టీమ్‌కు రూ.18.47 కోట్లు దక్కనున్నాయి.
ఇక మూడో స్థానంలో నిలిచిన టీమ్ఇండియాకు 12.31 కోట్లు ఖాతాలో చేరనున్నాయి. గత రెండు సార్లతో పోలిస్తే ఈసారి 13.67 కోట్లు ఎక్కువ కావడం విశేషం. ‘టెస్టు క్రికెట్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రైజ్‌మనీ పెంచడం ద్వారా టెస్టుల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ది ఏంటో తెలుస్తుంది’ అని ఐసీసీ పేర్కొంది.