WTC Points Table | ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దాంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టిక జట్టు మూడో స్థానానికి పడిపోయింది. పెర్త్ టెస్ట్‌లో విజయం అనంతరం టీమిండియా అగ్రస్థానంలో కొనసాగిన విషయం తెలిసిందే. ఓవల్ మైదానంలో జరిగిన టెస్ట్‌లో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓటమిపాలై మూడో స్థానానికి చేరింది. పెర్త్ టెస్ట్‌లో ఓటమి తర్వాత ఆసిస్ అద్భుతంగా పునరాగమనం చేసింది. డే-నైట్ టెస్టులో భారత్‌ను ఓడించి ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 180 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసి 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భారత్ రెండో ఇన్నింగ్స్ 175 పరుగులకు కుప్పకూలిపోయింది. రోహిత్ సేన 18 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 19 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా సాధించింది. ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనరల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు.. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-3తో సొంతగడ్డపై కోల్పోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా 4-0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించాల్సిన అవసరం ఏర్పడింది. పెర్త్ టెస్ట్‌లో విజయంతో అవకాశాలు మెరుగయ్యాయి.
రెండో మ్యాచ్‌లో ఘోర పరాజంతో సమీకరణాలు మొత్తం మారిపోయాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు మాత్రమే ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి. ప్రస్తుతం భారత్ మూడో స్థానానికి చేరింది. ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికా తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. రాబోయే మ్యాచుల్లో భారత్ విజయం సాధించకపోతే మరింత కష్టంగా మారడంతో పాటు రేసు నుంచి పూర్తిగా దూరమ్యే అవకాశం ఉంటుంది. భారత్‌పై విజయంతో ఆస్ట్రేలియా 60.71 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా జట్టు 59.26 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నది. 57.29 పాయింట్లతో భారత జట్టు మూడో స్థానంలో ఉన్నది.
రాబోయే మూడు మ్యాచుల్లో పునరాగమనం చేస్తేనే భారత్ 4-1 సిరీస్‌ని గెలిస్తేనే అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. భారత్‌కు ఇప్పటికీ అవకాశాలున్నాయి. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో టీమిండియా రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకోగలిగినా.. 60.52 పాయింట్లకు చేరుకుంటుంది. మూడింట్లో విజయం సాధిస్తే 64.05 పాయింట్లు ఖాతాలో చేరుతాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికాపై సైతం ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. శ్రీలంక, పాక్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించకపోయినా.. ఆస్ట్రేలియాతో జరిగే మిగతా మూడు మ్యాచుల్లో భారత్ విజయం సాధించే.. అవకాశాలు మెరుగవుతాయి.