WTC Points Table | ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్లో ఒక స్థానం దిగజారి మూడోస్థానానికి చేరుకుంది. లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ రెండు పాయింట్లు కోత విధించింది. అలాగే, బెన్ స్టోక్స్ నేతృత్వంలోని జట్టుకు మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 22 పాయింట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఇంగ్లండ్‌కు ఈ జరిమానా విధించారు. ఇంగ్లిష్ జట్టు నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. కనీస ఓవర్ రేటుకు సంబంధించిన సెక్షన్ 2.22 ప్రకారం ఆటగాళ్లు నిర్ణీత సమయానికి కంటే తక్కువ బౌలింగ్ చేస్తే ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో 5శాతం జరిమానా విధించినట్లు ఐసీసీ పేర్కొంది.
అంతే కాకుండా ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్లో ప్రతి ఓవర్‌కు ఒక పాయింట్ తగ్గిస్తారు. ఇంగ్లండ్ రెండు ఓవర్లు ఆలస్యంగా బౌలింగ్ చేసినందున ఇంగ్లండ్ జట్టుకు రెండు పాయింట్లు కోత విధించారు. దాంతో పాయింట్లు 24 నుంచి 22కు తగ్గాయి. పాయింట్స్ శాతం 66.67శాతం నుంచి 61.11 శాతానికి తగ్గింది. ఈ పరిణామంతో శ్రీలంక జట్టుకు ఊరట దక్కింది. 66.67 పాయింట్ల శాతంతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి రెండోస్థానంలోకి చేరుకుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా వందశాతం పాయింట్లతో WTC పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే, భారతదేశం 33.33 పాయింట్ల శాతంతో నాలుగో స్థానంలో ఉన్నది. ఇక ఇంగ్లిష్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తన తప్పుతో పాటు జరిమానాను అంగీకరించాడని.. దీనిపై అధికారిక విచారణ అవసరం లేదని తెలిపింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు పాల్ రీఫెల్, షరఫుదుల్లా ఇబ్నే షాహిద్, థర్డ్ అంపైర్ అహ్సాన్ రజా, ఫోర్త్ అంపైర్ నాల్గవ అంపైర్ గ్రాహం లాయిడ్ ఈ అభియోగాలు మోపారు.