SA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో తలపడిన దక్షిణాఫ్రికా (South Africa0, ఆస్ట్రేలియా (Australia) మరోసారి తలపడనున్నాయి. టెస్టు గద పోరులో హోరాహోరీగా ఢీకొన్న ఇరుజట్లు ఈసారి పొట్టి సిరీస్‌కు సిద్ధమవుతున్నాయి. మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆసీస్, ఎడెన్ మర్క్రమ్ నేతృత్వంలోని ప్రొటిస్ టీమ్ మధ్య ఆగస్టు 10 ఆదివారం తొలి మ్యాచ్‌తో మూడు టీ20ల సిరీస్ షురూ కానుంది.
వారం రోజుల ఈ సిరీస్‌కు డార్విన్స్ మర్రార స్టేడియం వేదిక కానుంది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలోని ఈ ఉత్తర భాగంలో క్రికెట్ మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. రికార్డుల విషయానికొస్తే.. ఇప్పటివరకూ ఇరుజట్లు 25 టీ20లు ఆడాయి. వీటిలో కంగారూ జట్టు 25 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా సపారీ జట్టు మాత్రం 8 మ్యాచుల్లో గెలిచిందంతే. క్రికెట్ అభిమానులు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో, జియో హాట్‌స్టార్ యాప్‌లో మ్యాచ్‌లను లైవ్‌గా చూడొచ్చు.
South Africa have Markram & Rabada back as they meet a big-hitting Australia – what’s your scoreline for the three-match T20 series?
Preview: https://t.co/fdSNyrQgYj pic.twitter.com/X1A6a7W7Ux
— ESPNcricinfo (@ESPNcricinfo) August 9, 2025
ఆస్ట్రేలియా స్క్వాడ్ : మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, డెన్ డ్వారుషీ, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, హేజిల్‌వుడ్, మాట్ కునేమన్, మ్యాక్స్‌వెల్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడం జంపా.
దక్షిణాఫ్రికా స్క్వాడ్ : ఎడెన్ మర్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాస్చ్, డెవాల్డ్ బ్రెవిస్, నంద్రె బర్గర్, జార్జ్ లిండే, మఫాకా, సెనురన్ ముతుస్వామి, లుంగి ఎంగిడి, కబా పీటర్, లానే డ్రె ప్రిటోరియస్, రబడ, రికెల్టన్, స్టబ్స్, ప్రెనెలాన్ సుబ్రయణ్, డస్సెన్.