న్యూఢిల్లీ: ఎట్టకేలకు భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు ఈనెల 21న జరుగనున్నాయి. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి రిటైర్డ్ జస్టిస్ ఎం.ఎం.కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలపై పంజాబ్-హర్యానా హైకోర్డు విధించిన స్టే ఆర్డర్‌ను సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో ఎన్నికల నిర్వహణకు అవకాశం ఏర్పడింది.