న్యూఢిల్లీ : తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్.. జాతీయ రెజ్లింగ్ సంఘం(డబ్ల్యూఎఫ్ఐ)ను అభ్యర్థించాడు. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్ టోర్నీలో నిర్దేశిత బరువు కంటే ఎక్కువ ఉన్న కారణంగా అర్హత కోల్పోయాడు. ఈ నేపథ్యంలో అమన్‌పై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ డబ్ల్యూఎఫ్ఐ నిర్ణయం తీసుకుంది.
అయితే సోమవారం ఐవోఏ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అమన్..తన నిషేధంపై స్పందించాడు. సస్పెన్షన్‌పై త్వరలో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్‌ను కలుస్తానని అమన్ అన్నాడు.