WPL | బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మరో రసవత్తర పోరు అభిమానులను అలరించింది. ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై ముంబై ఇండియన్స్‌దే పైచేయి అయ్యింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఉత్కంఠ విజయం సాధించింది.
ఈ సీజన్లో బెంగళూరుకు ఇదే తొలి ఓటమి. ఆర్సీబీ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో బంతి మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(50), నాట్ స్కీవర్(42) రాణించారు. వేర్హామ్(3/21)మూడు వికెట్లతో ఆకట్టుకుంది. తొలుత ఎలీస్ పెర్రీ(81) అర్ధసెంచరీతో ఆర్సీబీ 161/7 స్కోరు చేసింది. అమన్జోత్కౌర్(3/22) ధాటికి వ్యాట్(9), రాగ్వి(1), కనిక(3) విఫలమయ్యారు. అమన్‌జోత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.