WPL Auction | జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ధర ఎంతంటే..?
భారత స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ డబ్ల్యూపీఎల్ వేలంలో భారీ ధర పలికింది. ఈ స్టార్ క్రికెటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లోనే జెమీమ అదరగొట్టింది.
WPL Auction : భారత స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్. యంగ్ ఓపెనర్ షఫాలీ వర్మకు డబ్ల్యూపీఎల్ వేలంలో భారీ ధర పలికింది. ఈ స్టార్ క్రికెటర్లను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లోనే జెమీమ అదరగొట్టింది. వేలానికి ముందు రోజు పాకిస్థాన్‌తో జరిగిన పోరులో హాఫ్ సెంచరీ కొట్టిన జెమీమా ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించింది. రూ.50 లక్షలు కనీస ధర ఉన్న ఆమెను కొనుగోలు చేసేందుకు జట్లు పోటీ పడ్టాయి. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను దక్కించుకుంది. ఈ మధ్యే అండర్ -19 ప్రపంచకప్ గెలిచిన షఫాలీ వర్మను రూ.2 కోట్లకు ఈ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది.
హాఫ్ సెంచరీతో గెలిపించింది
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లకు 149 రన్స్ చేసింది. కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ 68 రన్స్ చేయడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్‌లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ, యస్తిక భాటియా శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరిని ఔట్ చేసి పాక్ ఇండియా మీద ఒత్తిడి పెంచింది. అయితే.. కీపర్ రీచా ఘోష్(31)తో కలిసి జెమీమా (53) కీలక ఇన్నింగ్స్ ఆడింది. దాంతో, ఒక ఓవర్ మిగిలి ఉండగానే భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. జెమీమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Shafali Verma goes to Delhi Capitals for INR 2 Crore#WPLAuction | #CricketTwitter | #WomensIPL #WPL2023 #WPL pic.twitter.com/FZUdc3JmJu
— Women’s Premier League (WPL) #WPL2023 (@wpl2023) February 13, 2023
Meg Lanning sold to Delhi Capitals at 1.1cr. #WPLAuction #WPL2023 #CricketTwitter #WPL #WomensPremierLeague pic.twitter.com/ACQJ3Huarn
— Women’s Premier League (WPL) #WPL2023 (@wpl2023) February 13, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

