WPL Auction : డబ్ల్యూపీఎల్ వేలంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.1.80 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్‌ను ముంబై ఫ్రాంఛైజీ దక్కించుకుంది. రూ. 50 లక్షల కనీస ధర ఉన్న హర్మన్‌ప్రీత్‌ను కొనుగోలు చేసేందుకు యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఫ్రాంఛైజీలో పోటీ పడ్డాయి. అయితే.. ఆఖరుకు ముంబై ఇండియన్స్ ఈ స్టార్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది.
హర్మన్‌ప్రీత్‌కు భారత్ తరఫున ఎక్కువ టీ20లు ఆడిన అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఆమె 147 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఆమె సారథ్యంలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లకు 149 రన్స్ చేసింది. కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ 68 రన్స్ చేయడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్‌లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ (33), యస్తిక భాటియా శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరిని ఔట్ చేసి పాక్ ఇండియా మీద ఒత్తిడి పెంచింది. అయితే.. కీపర్ రీచా ఘోష్(31)తో కలిసి జెమీమా (53) కీలక ఇన్నింగ్స్ ఆడింది. జెమీమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
KLASSIC KAUR 🔨 180L ☑️ #OneFamily #MumbaiIndians #AaliRe #WPLAuction pic.twitter.com/u3Qk3998HE
— Mumbai Indians (@mipaltan) February 13, 2023