వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కొనసాగుతున్నది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న ఆ జట్టు.. వడోదరలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాట్‌తో ఆ తర్వాత బంతితో చెలరేగిన ఆర్సీబీ.. టోర్నీలో ఐదో విజయాన్ని నమోదుచేసి నాకౌట్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. గౌతమి నాయక్ (55 బంతుల్లో 73, 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 20 ఓవర్లకు 178/6 రన్స్ చేసింది. రిచా ఘోష్ (27), కెప్టెన్ స్మృతి మంధాన (26) ఫర్వాలేదనిపించారు. లక్ష్య ఛేదనలో జెయింట్స్.. బ్యాటింగ్ వైఫల్యంతో 20 ఓవర్లకు 117/8 వద్దే ఆగిపోయింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (43 బంతుల్లో 54, 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు.
బెంగళూరు: 20 ఓవర్లలో 178/6 (గౌతమి 73, రిచా 27, కాశ్వీ 2/38, ఆష్లీ 2/43); గుజరాత్: 20 ఓవర్లలో 11 /8 (ఆష్లీ 54, అనుష్క 18, సయాలి 3/21, డీ క్లర్క్ 2/17)