WPL 2024 | యూపీని ఆదుకున్న దీప్తి.. భారమంతా బౌలర్ల మీదే..
WPL 2024, DC vs UP | ఢిల్లీ క్యాపిటల్స్‌తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.
WPL 2024, DC vs UP | మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఆడుతున్న యూపీ వారియర్స్ బ్యాటింగ్‌లో తడబడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. యూపీ జట్టులో దీప్తి శర్మ (48 బంతుల్లో 59, 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో యూపీని ఆదుకుంది. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, టిటాస్ సాధులు తలా రెండు వికెట్లు తీశారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ రెండో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. కిరణ్ నవ్గిరె (5) ను టిటాస్ సాధు బౌల్డ్ చేసింది. మరో ఓపెనర్, కెప్టెన్ అలిస్సా హీలి (30 బంతుల్లో 29, 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. తహిలా మెక్‌గ్రాత్ (3) కూడా విఫలమైంది. కానీ వన్ డౌన్లో వచ్చిన దీప్తి శర్మ, గ్రేస్ హరీస్ (12 బంతుల్లో 14, 1 ఫోర్) లు నాలుగో వికెట్‌కు 33 రన్స్ జోడించారు.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయడానికి నానా తంటాలుపడ్డాడు. శ్వేతా సెహ్రావత్ (4), పూనమ్ ఖేమ్నర్ (1), సోఫి ఎకిల్‌స్టోన్ (8)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. దీప్తి శర్మ అర్థ సెంచరీ చేయడంతో యూపీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
One brings two for @Deepti_Sharma06 🙌
Back to back half-centuries for the @UPWarriorz all-rounder 👏👏
Can she finish the innings on a high?
Live 💻📱https://t.co/HW6TQgqctC#TATAWPL | #DCvUPW pic.twitter.com/yGc6IgQyaf
— Women’s Premier League (WPL) (@wplt20) March 8, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

