WPL 2024 | తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెలరేగిన లారా, మూనీ.. ఆర్సీబీ ఎదుట భారీ లక్ష్యం
WPL 2024, GG vs RCB | ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు (ఆర్సీబీతో ప్రస్తుత మ్యాచ్ కాకుండా) నాలుగు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడిన గుజరాత్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యావశ్యకం.
WPL 2024, GG vs RCB | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో తొలి విజయానికి తహతహలాడుతున్న గుజరాత్ జెయింట్స్ ఆ దిశగా ఒక అంకాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తో ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ మునుపెన్నడూ లేనివిధంగా దంచికొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు కెప్టెన్ బెత్ మూనీ (51 బంతుల్లో 85 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్సర్), లారా వోల్వార్డ్ట్ (45 బంతుల్లో 76, 13 ఫోర్లు) చెలరేగి ఆడారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ ఆది నుంచే ధాటిగా ఆడింది. వోల్వార్డ్ట్ – మూనీలు తొలి వికెట్‌కు ఏకంగా 140 పరుగులు జోడించారు. డబ్ల్యూపీఎల్ లో ఏ వికెట్‌కు అయినా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. గత సీజన్లో ఢిల్లీ ఓపెనర్లు షఫాలీ వర్మ – మెగ్ లానింగ్‌లు ఇదే ఆర్సీబీతో మ్యాచ్‌లో 162 పరుగులు జోడించారు. తాజాగా లారా-మూనీలు 140 పరుగులు జతచేశారు. ఇద్దరూ కలిసి ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించడంతో గుజరాత్‌కు ఘనమైన ఆరంభం దక్కింది. ఏ వికెట్‌కు అయినా గుజరాత్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.
32 బంతుల్లోనే వొల్వార్డ్ట్ అర్థ సెంచరీ పూర్తిచేసుకోగా 33 బంతుల్లో మూనీ హాఫ్ సెంచరీ పూర్తయింది. మూనీ హాఫ్ సెంచరీ తర్వాత సమన్వయ లోపం కారణంగా లారా రనౌట్ అయినా ఆ తర్వాత మూనీ వీరవిహారం చేసింది. లారా – మూనీల ధాటికి ఆర్సీబీ బౌలర్లు భారీగా పరగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఏడుగురు బౌలర్లను ఉపయోగించగా.. అందులో నలుగురు బౌలర్ల ఎకానమీ 10 దాటగా మిగిలిన ముగ్గురువి 8 కంటే ఎక్కువగా ఉన్నాయి.
ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు (ఆర్సీబీతో ప్రస్తుత మ్యాచ్ కాకుండా) నాలుగు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడిన గుజరాత్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యావశ్యకం. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టు ప్లేఆఫ్ ఆశలను వదిలేసుకున్నట్టే.. కాగా, కీలక మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు సాధించడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

