WPL 2024 | డబ్ల్యూపీఎల్ కొత్త చరిత్ర సృష్టించిన ఎలీస్ పెర్రీ.. తొలి క్రికెటర్గా రికార్డు
WPL 2024, Ellyse Perry | బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పెర్రీ.. 4 ఓవర్లు వేసి 15 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లతో చెలరేగింది. డబ్ల్యూపీఎల్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
WPL 2024, Ellyse Perry | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) సరికొత్త చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పెర్రీ.. ఆరు వికెట్లు తీసింది. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పెర్రీ.. 4 ఓవర్లు వేసి 15 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లతో చెలరేగింది. డబ్ల్యూపీఎల్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఒక బౌలర్ ఆరు వికెట్లు తీయడం ఇదే ప్రథమం.
డబ్ల్యూపీఎల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు..
– ఎలీస్ పెర్రీ, ఆర్సీబీ (6/15)
– మరిజన్నె కాప్, ఢిల్లీ (5-15)
– ఆశా శోభన, ఆర్సీబీ (5-22)
– తారా నోరిస్, ఢిల్లీ (5-29)
– కిమ్ గార్త్, గుజరాత్ (5-36)
Commentators: Nobody has taken a 6 wicket haul in WPL. 🤔
Perry took it personally. 6-fer for the GOAT! 🐐#PlayBold #ನಮ್ಮRCB #WPL2024 #SheIsBold #MIvRCB @EllysePerry pic.twitter.com/Q4VGcJIpXI
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2024
నేటి మ్యాచ్లో పెర్రీ.. ఏకంగా నలుగురు బ్యాటర్లను బౌల్డ్ చేయగా ఇద్దరిని ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపింది. పెర్రీ ధాటికి ముంబై బ్యాటింగ్ లైనప్ అతలాకుతలమైంది. 8 ఓవర్లు ముగిసేటప్పటికీ 65-2గా ఉన్న ముంబై.. 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 82-7గా ఉందంటే అది పెర్రీ మాయే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

