చికాగో: వరల్డ్ స్కాష్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ పోరాటం రెండో రౌండ్‌కే ముగిసింది. సింగిల్స్ విభాగాల్లో నలుగురు ప్లేయర్లు బరిలోకి దిగినా ఒక్కరు కూడా ముందంజ వేయలేకపోయారు. మహిళల సింగిల్స్‌లో అన్హత్ సింగ్‌తో పాటు పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్, వీర్ ఛత్రోని, రమిత్ టాండన్ ఓటములపాలై ఇంటిబాట పట్టారు.