MS Dhoni : భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరు చిరస్మరణీయం. కెప్టెన్‌గా మహీ భాయ్ మరెవరీకి సాధ్యం కాని రికార్డులు నెలకొల్పాడు. కపిల్ దేవ్ (Kapil Dev)తర్వాత టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన రెండో సారథిగా చరిత్రకెక్కాడు ధోనీ. అంతేకాదు తొలి ఎడిషన్ పొట్టి ప్రపంచకప్‌ను భారత జట్టుకు అందించి ‘జయహో నాయకా’ అనిపించుకున్నాడీ ఝార్ఖండ్ డైనమైట్. హెలిక్యాప్టర్ షాట్‌ను క్రికెట్‌కు పరిచయం చేసిందీ ఇతడే. ఐసీసీ ట్రోఫీల్లో మన జట్టు బలాన్ని చూపించిన తాలా.. సరిగ్గా ఐదేండ్ల క్రితం ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
తన హయాంలో జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. 2019లో తన కెరీర్ ముగించాడు. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత ఈ క్షణంలో నా కెరీర్ ముగిసింది అని అభిమానులకు షాక్ ఇచ్చాడీ వెటరన్ ప్లేయర్. 1929 నుంచి నేను రిటైర్ అయినట్టుగా భావించండి అని ఒకే ఒక వ్యాఖ్యంలో ఆటకు వీడ్కోలు పలికాడీ దిగ్గజం. కివీస్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో జట్టును గెలిపించేందుకు శాయశక్తులా పోరాడాడు ధోనీ. అర్ధ శతకం బాదిన అతడు రవీంద్ర జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
“from 1929 hrs consider me as Retired”
Living up to his reputation for doing the unexpected, MS Dhoni announced his international retirement with an Instagram post, five years ago today
A legendary career 🐐 pic.twitter.com/9Nk7RHufSV
— ESPNcricinfo (@ESPNcricinfo) August 15, 2025
అయితే.. మార్టిన్ గఫ్తిల్ విసిరిన మెరుపు త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతే టీమిండియా ఓటమి ఖాయమైంది. అయ్యో.. టీమ్‌ను ఫైనల్ చేర్చలేకపోయాననే బాధతో ఆ క్షణమే అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా పలకాలని మనసులో డిసైడ్ అయ్యాడు మహీ భాయ్. ఈ విషయాన్ని 2020 ఆగస్టు 15న అధికారికంగా వెల్లడించాడు. ఓవైపు వికెట్ కీపర్‌గా.. మరోవైపు విధ్వంసక ఆటగాడిగా, ఏడో స్థానంలో ఫినిషర్‌గా ఇలా ఎన్నో బాధ్యతల్ని సమర్ధంగా నిర్వర్తించాడు ధోనీ. తన హెలిక్యాప్టర్ షాట్లతో అభిమానులను అలరించిన ఈ స్టార్ ఆటగాడు వన్డేల్లో 10,773, టెస్టుల్లో 4,876, టీ20ల్లో1,617 పరుగులు సాధించాడు.
Legends like MS Dhoni don’t just retire, they become timeless! 🥹♥️ pic.twitter.com/x8UCOW63dN
— Punjab Kings (@PunjabKingsIPL) August 15, 2025
ఝార్ఖండ్ నుంచి యావత్ భారతం గర్వించదగ్గ క్రికెటర్‌గా ఎదిగాడు ధోనీ. కుటుంబానికి అండగా ఉండేందుకు టికెట్ కలెక్టర్‌గా పని చేస్తూనే.. భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు ధోనీ. జులపాల జుట్టుతో 2004లో బంగ్లాదేశ్‌పై వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన అతడు.. ఏడాది తర్వాత టెస్టు మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్ కంటే వన్డేలతోనే పేరు తెచ్చుకున్న ధోనీ శ్రీలంకపై (183), పాకిస్థాన్‌పై (148) సెంచరీలతో విరుచుకుపడడాన్ని అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు.
That heartbreaking moment when MS Dhoni was run out in the 2019 World Cup semifinal against New Zealand… 💔#MSDhoni #2019semifinal #cricket #indiavsnewzealand #indvs pic.twitter.com/igDLuXnbmk
— ..God (@RohanVarma_99) July 9, 2025
టీమిండియా సారథిగా 2007లో బాధ్యతలు చేపట్టిన ధోనీ.. అదే ఏడాది భారత జట్టుకు తొలి టీ20 వరల్డ్ కప్ అందించాడు. ఆపై సొంతగడ్డపై 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించి పెట్టాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు ట్రోఫీలు కట్టబెట్టిన నాయక శిఖరం ధోనీ. వయసు పైబడుతున్నా ఫ్రాంచైజీ కోసం మైదానంలోకి దిగుతున్న తాలా.. వచ్చే సీజన్లో ఆడడంపై సందిగ్ధత కొనసాగుతోంది.