World Cup Final : మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు రెండు రోజులే ఉంది. మెగా టోర్నీ చరిత్రలో తొలిసారి ఛాంపియన్‌గా అవరించే జట్టేదే ఆదివారం తేలిపోనుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లలో ట్రోఫీని కొల్లగొట్టేది ఎవరు? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఫైనల్ ఫైట్‌ను ప్రత్యక్షంగా స్టేడియానికి వెళ్లి చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ టికెట్ అమ్మకాలపై గందరగోళం నెలకొంది. ఎందుకంటే.. శుక్రవారం నాడు కూడా టికెట్లు అందుబాటులో లేవు. దాంతో, ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాకౌట్ పోరులో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్ ఫైనల్ చేరడంతో టైటిల్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఫైనల్లో టీమిండియా గెలుపొంది కప్ అందుకుంటే చూడాలని ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. కానీ, వరల్డ్ కప్ ఫైనల్ టికెట్ల అమ్మకాలపై ఇంకా స్పష్టత రాలేదు. బుక్‌మైషో (Book My Show) వెబ్సైట్లో చెక్ చేస్తే త్వరలోనే అమ్మకాలు మొదలవుతాయి అని చూపిస్తోంది. దాంతో.. ఫ్యాన్స్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. సెమీస్‌కు వేదికైన డీవై పాటిల్ మైదానంలోనే నవంబర్ 2 ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ జరుగనుంది.
India will meet South Africa in the #CWC25 Final 🤩🇮🇳 pic.twitter.com/z0uvXXRDye
— ICC Cricket World Cup (@cricketworldcup) October 30, 2025