గ్రేటర్ నోయిడా : ప్రపంచ బాక్సింగ్కప్ ఫైనల్స్ టోర్నీకి భారత్ ఆతిత్యమివ్వనుంది. నవంబర్ 14 నుంచి 21 వరకు గ్రేటర్ నోయిడాలో ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. మొత్తం 18 దేశాల నుంచి 140 మందికి పైగా అగ్రశ్రేణి బాక్సర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు. వీరిలో ముగ్గురు ఒలింపిక్ పతక విజేతలు ఉండటం విశేషం.
ఈ టోర్నీలో భారత్ నుంచి 20 మంది(10 మంది పురుషులు, 10 మంది మహిళలు) కూడిన జట్టుతో బరిలోకి దిగుతున్నది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్(51కి), జాస్మిన్ లంబోరియా(57కి), మీనాక్షి(48కి), రెండుసార్లు ఆసియా చాంపియన్ పూజారాణి(80కి) వంటి బాక్సర్లు భారత్ తరఫున పోటీ పడుతున్నారు.