INDW | స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్‌లో టీమిండియా వుమెన్స్ జట్టు వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. సెమీస్ రేసులో నిలువాలంటే తప్పనిసరిగా గెలువాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపు గెలుపు అంచుల వరకు చేరి.. కీలక సమయంలో తడబడి ఓటమిని మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌పై భారత జట్టు ఓటమిపై వైస్ కెప్టెన్ స్మృతి మంధాన స్పందించింది. ఓటమికి తనను తానే నిందించుకున్నది. తాను అవుట్ కావడం బ్యాటింగ్ ఆర్డర్‌కు ఆటంకం కలిగించిందని చెప్పింది. షాట్ ఎంపిక మరింత మెరుగ్గా ఉంటే బాగుండేదని స్మృతి చెప్పుకొచ్చింది. 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు ఒక సమయంలో మంచి స్థితిలో ఉండగా.. చివరకి ఓటమిపాలైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి స్మృతి 88 పరుగులు, దీప్తిశర్మతో కలిసి67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కానీ, షాట్ సెలక్షన్లో లోపంతో పెవిలియన్‌కు చేరింది.
దాంతో ఇంగ్లండ్ జట్టు పుంజుకొని.. మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు చేరింది. ఈ సందర్భంగా స్మృతి మాట్లాడుతూ షాట్ సెలక్షన్ మెరుగ్గా ఉండాలని తాను నమ్ముతున్నానని.. మ్యాచ్‌లో గెలిచేందుకు ఓవర్‌కు ఆరు పరుగులు మాత్రమే అవసరమని.. బహుశా ఆటను మరింత ముందుకు తీసుకెళ్లి ఉండాల్సిందని.. జట్టు పతనాన్ని ప్రారంభించాను కాబట్టి.. ఓటమికి నేను బాధ్యత వహిస్తానని స్మృతి పేర్కొంది. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఐదుగురు బౌలర్ల కలయికతో ఆడిన టీమిండియా.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు జెమిమా రోడ్రిగ్స్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్‌ను తీసుకోవాలని జట్టు యాజమాన్యం భావించింది. గత రెండు మ్యాచుల్లో.. ముఖ్యంగా ఫ్లాట్ ఇండోర్ వికెట్లో ఐదుగురు బౌలర్ల ఆప్షన్ సరిపోదని భావించామని.. రోడ్రిగ్స్ లాంటి ప్లేయర్‌ను పక్కనపెట్టడం కఠినమైన నిర్ణయమని స్మృతి చెప్పింది. కానీ కొన్ని సార్లు సమతుల్యత కోసం అలాంటి పని చేయాల్సి వస్తుందని.. భవిష్యత్‌లో కూడా ఇలా చేస్తామని చెప్పలేమని.. పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వివరించింది.