ఆక్లాండ్: మహిళల ప్రపంచకప్‌లో (Women’s World Cup) ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతున్నది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా.. ఆరంభంలో రెండు వికెట్లను కోల్పోయింది. స్టార్ బ్యాటర్ స్మృతి మూడో ఓవర్లోనే వెనుతిరగగా, యువ సంచలనం షఫాలీ 12 పరుగులు చేసి పెవీలియన్ చేరింది. ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చిన యస్తికా భాత్రా, మిథాలీ రాజ్ జట్టును ఆదుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు తీశామన్న ఆసీస్ బౌలర్ల ఆనందాన్ని ఎక్కువసేపు నిలువనీయలేదు.
వికెట్లు కాపాడుకుంటూనే ఒక్కొక్క పరుగు జోడిస్తూ పోయారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధసెంచరీలు చేశారు. అయితే 83 బాల్స్ ఆడిన యస్తికా.. ఇన్నింగ్స్ 31వ ఓవర్లో మూడో వికెట్‌గా వెనుతిరిగింది. ఇక కెప్టెన్స్ ఇన్సింగ్ ఆడుతూ 63 పరుగులు చేసింది. ప్రస్తుతం 36 ఓవర్లు ముగిసే సరికి టీమ్ఇండియా మూడు వికెట్ల నష్టానికి 181 చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (8 బాల్స్ 5 రన్స్), మిథాలీ (64) క్రీజులో ఉన్నారు.