క్రైస్ట్‌చర్చ్: మహిళల ప్రపంచకప్ (womens world cup) ఫైనల్లో మాజీ చాంపియన్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. క్రైస్టచర్చ్లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. టాప్ఆర్డర్ రానించడంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 356 పరుగు చేసింది. ఓపెనర్ ఎలిస్సా హీలీ ఇంగ్లండ్ బౌర్లపై మొదటినుంచే ఎదురుడాదికి దిగడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. 138 బంతులు ఆడిన ఆమె 170 (26 ఫోర్లు) రన్స్ చేసింది. మరో ఎండ్‌లో రచైల్ చక్కగా బ్యాటింగ్ చేసి 68 పరుగులు సాధించింది. మూడో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన బెత్ మూనీ కూడా బ్యాట్ ఝులిపించింది. 47 బంతుల్లోనే 62 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 356 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బౌలర్లలో అన్య శ్రుబ్సోల్ ఒక్కతే చెప్పుకోదగిన ప్రదర్శన చేసింది. 10 ఓవర్లు వేసిన శ్రుబ్సోల్ 46 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నది. మిలిన బౌలర్లంతా పరుగులు ఆసీస్ బ్యాటర్ల ధాటికి కోట్టుకుపోయారు. 34 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతున్నాయి.