Womens T20 WC : కీలకమైన మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీ సాధించింది. కారా ముర్రే ఓవర్లో సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 40 బంతుత్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మంధాన అర్థ శతకం బాదింది. ఈ ప్రపంచకప్‌లో మంధానకు ఇది రెండో ఫిఫ్టీ. రెండో వికెట్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ (12), మంధాన కలిసి 42 రన్స్ జోడించారు. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది. అంతకుముందు మొదటి వికెట్‌కు షఫాలీ వర్మతో 62 పరుగులు జోడించింది.
భారత్ 62 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ (24) ఔట్ అయింది. డెలానీ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకుంది. ఐర్లాండ్ బౌలర్లు జార్జినా డెంప్సే, ఒర్లా ప్రెండెర్‌గాస్ట్, అరియెనె కెల్లీ కట్టుదిట్టంగా బంతులు వేస్తుండడంతో షఫాలీ, మంధాన భారీ షాట్లు ఆడలేకపోయారు.