ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 4న ప్రారంభం కానున్న ఈ లీగ్.. 26న జరుగనున్న ఫైనల్‌తో ముగియనుంది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. అన్నీ మ్యాచ్‌లు ముంబైలోనే జరుగనుండటం విశేషం.
లీగ్ ఆరంభ పోరులో గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది. అన్నీ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో మ్యాచ్ మార్చి 5న బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగనుంది. అదే రోజు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మూడో పోరు జరుగనుంది.