బతుమి(జార్జియా): ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన క్వార్టర్స్ తొలి రౌండ్ పోరులో భారత గ్రాండ్‌మాస్టర్లు సత్తాచాటారు. ఆసక్తికరంగా సాగిన పోరులో కోనేరు హంపి 1-0తో యుగ్జిన్ సంగ్(చైనా) గెలిచి అదరగొట్టింది. తెల్లపావులతో బరిలోకి దిగిన హంపి 53 ఎత్తుల్లో సంగ్‌ను చిత్తు చేసింది.
మిగతా మ్యాచ్‌ల్లో దివ్యాదేశ్ముఖ్, ద్రోణవల్లి హారిక మధ్య తొలి గేమ్ 31 ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. మరో పోరులో వైశాలి 72 ఎత్తుల దగ్గర టాన్ జాంగ్జి(చైనా) డ్రా చేసుకుంది. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి హంపి, లీ టింగ్జి ఒక్కో పాయింట్‌తో ఉన్నారు.