దుబాయ్ : మహిళల ఆసియా కప్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగి ఓటమన్నదే లేకుండా ఆడుతున్న భారత్ సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీస్‌లో హర్మన్‌ప్రీత్ సేన.. బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ పూర్తి ఏకపక్ష విజయాలు సాధించిన భారత జట్టు జోరును అడ్డుకోవడం నిగర్ సుల్తానా సారథ్యంలోని బంగ్లా జట్టుకు శక్తికి మించిన పనే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలోనూ బంగ్లా, టీమిండియాకు దరిదాపుల్లో కూడా లేదు. గ్రూప్ దశలో శ్రీలంకతో ఓడిన ఆ జట్టు ఇండోనేషియా, యూఏఈ వంటి అనామక జట్లపై గెలిచి సెమీస్ చేరింది. ఇక గత పోరులో దాయాది పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించడం హర్మన్ సేన ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది.
స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, ప్రతీక రావల్‌తో కూడిన భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను అడ్డుకోవడం బంగ్లాకు సవాలే. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 64 బంతుల్లోనే 124 రన్స్‌తో దుమ్మురేపిన స్మృతి నుంచి భారత్ మరోసారి అలాంటి ఇన్నింగ్సే ఆశిస్తోంది. షెఫాలీ సైతం దూకుడుగానే ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చేదే. స్పిన్‌కు సహకరించే దుబాయ్ పిచ్‌లపై దీప్తి శర్మ, శ్రీ చరణి, ప్రేమ రావత్ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ మ్యాచ్‌లను భారత్ వైపు తిప్పుతున్నారు. టీమిండియా పేస్, స్పిన్ దాడిని తట్టుకుని బంగ్లా ఏ మేరకు నిలబడుతుందనేది చూడాలి. ఇటీవల కాలంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో భారత్, బంగ్లా పోరు సైతం అభిమానులకు పసందైన క్రికెట్ మజాను పంచనుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.