కూపర్టినో (క్యాలిఫోర్నియా), సెప్టెంబర్ 9: ఐఫోన్ ప్రియులకు శుభవార్త. తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను యాపిల్ పరిచయం చేసింది మరి. బుధవారం డ్యూయో పేరిట దీన్ని ఆవిష్కరించింది. అలాగే 18 సిరీస్‌లో ప్రో, ప్రో మ్యాక్స్ మొబైల్స్‌ను తీసుకొచ్చింది. ఎయిర్‌పాడ్స్ 5, వాచ్ 12, వాచ్ అల్ట్రా 4లు కూడా విడుదలయ్యాయి. ఇక ప్రస్తుతం యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఫీచర్లకు కొదవ లేకుండా వీటిని యాపిల్ తీసుకురావడం విశేషం. డిస్ప్లే, కెమెరా, స్టోరేజీ, బ్యాటరీ సామర్థ్యం, పనితీరు అన్నింటా మేటిగా నిలబెట్టింది. కాగా, దేశీయ మార్కెట్లో శనివారం నుంచి ముందస్తు ఆర్డర్లు చేసుకోవచ్చు. ఈ నెల 18 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.


Airpods