Women Wrestler : భారత రెజ్లింగ్‌లో భావి తారగా ప్రశంసలు అందుకుంటున్న రితికా హుడా (Reetika Hooda) కెరీర్ ప్రమాదంలో పడింది. దేశంలో తొలి అండర్ -23 ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించిన రీతికా .. అనూహ్యంగా డోప్ పరీక్ష(Dope Test)లో పట్టుబడింది. ఆసియా ఛాంపియన్షిప్స్ ముందు మార్చి 15న నిర్వహించిన టెస్టులో ఆమె విఫలం అయింది. రితికా మూత్ర నమూనాలో నిషేధిత ఎస్ 1 అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టిరాయిడ్స్ ఉన్నట్టు గుర్తించారు. దాంతో, జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ నాడా ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశముంది. కానీ, ప్రస్తుతానికైతే ఏడాది సస్పెన్షన్‌తో సరిపెట్టింది.
సీనియర్ స్థాయికి చేరువైన రితికా డోప్ పరీక్షలో దొరికిపోవడం భారత్‌కు పెద్ద షాక్. ఈ ఏడాది చివర్లో జరుగబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె పాల్గొనడం సాధ్యంకాకపోవచ్చు. అయితే.. రెజ్లర్ మాత్రం తానేమీ తప్పు చేయలేదని చెబుతోంది. ‘నాకు నిషేధం గురించి విషయం తెలియదు. నేను ఏ పొరపాటు చేయలేదు. విచారణలో నాడా అధికారులకు, రెజ్లింగ్ సమాఖ్యలకు పూర్తిగా సహకరిస్తాను. ప్రస్తుతం నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను.
🚨#Breaking | Paris Olympian and Asian Championship medalist Reetika Hooda has tested positive for performance-enhancing drugs.
👉The wrestler has now has been provisionally suspended till July 7, 2026.#news #wrestling #doping #ban #suspension pic.twitter.com/8BS0ZASbd3
— The Bridge (@the_bridge_in) July 8, 2025
డోప్ టెస్టులకు మరొకసారి (బీ శాంపిల్) శాంపిల్ ఇవ్వాలని అనుకుంటున్నా’ అని రీతికా పీటీఐతో అంది. పారిస్ ఒలిపింక్స్‌లో 76కిలోల విభాగంలో విఫలమైన రితికా.. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో వెండి పతకం సాధించింది. ఆ తర్వాత మంగోలియాలో జరిగిన యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకిగ్ సిరీస్‌లోనూ సత్తా చాటి గోల్డ్ మెడల్ కొల్లగొట్టిందీ యంగ్‌స్టర్.