Women Power : టోక్యో ఒలింపిక్స్‌లో రాణులదే హవా..!
Women Power : టాప్-5 దేశాల మహిళలు.. పురుషుల కంటే 67 శాతం ఎక్కువ పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ ఐదు దేశాలకు చెందిన మహిళలు ఇప్పటివరకు 194 పతకాలు సాధించగా.. పురుషులు కేవలం 116 మాత్రమే అందుకున్నారు.

టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్ ఇప్పుడిప్పుడే తారాస్థాయికి చేరుకున్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో పోటీలు జరుగుతుండటంతో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళలకు సమాన సంఖ్యలో క్రీడాంశాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్‌లో పురుషుల కంటే మహిళా క్రీడాకారులే (Women Power) ఎక్కువ పతకాలు సాధించి ముందు వరుసలో ఉన్నారు. టాప్-5 దేశాల మహిళలు.. పురుషుల కంటే 67 శాతం ఎక్కువ పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ ఐదు దేశాలకు చెందిన మహిళలు ఇప్పటివరకు 194 పతకాలు సాధించగా.. పురుషులు కేవలం 116 మాత్రమే అందుకున్నారు.
పతకాల పట్టికలో (శనివారం వరకు ) ఒకటో స్థానంలో ఉన్న చైనా దేశానికి చెందిన మహిళలు.. పురుషుల కన్నా రెండు రెట్లు ఎక్కువగా పతకాలు సాధించారు. అమెరికన్ మహిళలు ఆ దేశ పురుషుల కంటే మూడు రెట్లు గెలిచి రాణులదే హవా అని నిరూపిస్తున్నారు. ఇదే ట్రెండ్ జపాన్, రష్యా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఉన్నది. భారతదేశానికి ఇప్పటివరకు ఒకే ఒక్క పతకం అందింది. ఈ పతకం కూడా మహిళ ద్వారా అందిందే కావడం విశేషం. ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్‌లో 35 మహిళలు రెండు అంతకన్నా ఎక్కువ మెడల్స్ సాధించగా.. పురుషులు కేవలం 19 మందే రెండు కన్నా పతకాలు అందుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా నాలుగు పతకాలు సాధించి ముందు వరుసలో ఉన్నది. చైనా, జపాన్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా దేశాల నుంచి మొత్తం 2450 మంది అథ్లెట్లు పాల్గొనగా, వీరిలో నుంచి 1354 మంది మహిళలు, 1096 మంది పురుషులు ఉన్నారు.
ఒలింపిక్స్‌లో గుర్రపుస్వారీ పోటీ ఓపెన్ క్యాటగిరీలో ఉంటుంది. ఇందులో పురుషులు, మహిళలు ఎవరైనా పాల్గొనవచ్చు. ఓపెన్ క్యాటగిరీలో ఇప్పటివరకు మొత్తం 12 పతకాల ఈవెంట్లు జరిగాయి. ఇందులో 10 పతకాలను మహిళలు గెలుచుకోగా, పురుషులు 2 పతకాలకే పరిమితమయ్యారు.
ఇవి కూడా చదవండి..
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువేనా..?
ప్రపంచ అతిపెద్ద గేమింగ్ కంపెనీపై లైంగిక వేధింపుల కేసు
చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

