Mahesh Babu – Ashes Series: ఎడ్జ్‌బాస్టన్ యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్(England) ఆటగాళ్లు తమ మార్క్ బాజ్‌బాల్(BazzBall) ఆటతో చెలరేగారు. జో రూట్(118 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) మొదటి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లేర్ చేశాడు. స్టోక్స్ నిర్ణయం ఆస్ట్రేలియాతో సహా పలువురు క్రికెట్ ఫ్యాన్స్ ఒకింత షాక్‌కు గురి చేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) ఇంగ్లండ్ బాజ్‌బాల్ ఆటపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం పట్ల ఈ సూపర్ స్టార్ నేను చదువుతున్నది నిజమేనా? అని సరదాగా జోక్ చేశాడు.
‘వావ్.. వావ్.. బాజ్‌బాల్.. కొత్త తరహా క్రికెట్‌కు నిదర్శనం’ అని మహేశ్ తన ట్వీట్లో రాశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ‘సర్కారు వారి పాట'(Sarkaru Vaari Paata) తర్వాత మహేశ్ ‘గుంటూరు కారం'(Guntur Karam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో అతను మాస్ లుక్‌లో కనిపించనున్నాడు.
393-8 d… Am I reading this right… Wow… Just wow… Witnessing a new era of Cricket… Bazball 🔥🔥🔥#ENGvsAUS #Ashes2023
— Mahesh Babu (@urstrulyMahesh) June 16, 2023
టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ మరో ఆలోచనే లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఓపెనర్ బెన్ డకెట్(12) తక్కువకే వెనుదిరిగినా మరో ఓపెనర్ జాక్ క్రాలే(61) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓలీ పోప్(31), హ్యారీ బ్రూక్(31) త్వరగా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన జానీ బెయిర్‌స్టో, రూట్‌తో కలిసి ధనాధన్ ఆడాడు. బాజ్‌బాల్ ఆటతో అర్ధ శతకం సాధించాడు.
జో రూట్ సెంచరీ అభివాదం
ధాటిగా ఆడే క్రమంలో అతను లియాన్ చేతికి చిక్కాడు. రూట్(118 నాటౌట్) సెంచరీ మార్కు అందుకున్న కాసేపటికి స్టోక్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(8), ఉస్మాన్ ఖవాజా4) క్రీజులో ఉన్నాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 349 పరుగులు వెనకబడి ఉంది.