లండన్ : విజ్డెన్ అల్మానాక్ 2026 అవార్డుల్లో భారత క్రికెటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. తొమ్మిది విభాగాల్లో ఏడింటిని కైవసం చేసుకున్నారు. స్వదేశం వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ దీప్తి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ 22 వికెట్లు పడగొట్టింది. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన దీప్తి…టీమ్ఇండియా వరల్డ్‌కప్ గెలువడంలో కీలకంగా వ్యవహరించింది.
వీటిని పరిగణనలోకి తీసుకున్న విజ్డెన్..దీప్తిని ‘వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసింది. టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా అభిషేక్‌శర్మ ఎంపిక కాగా, ఫైవ్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు జాబితాలో టీమ్ఇండియా నుంచి గిల్, సిరాజ్, పంత్, జడేజా చోటు దక్కించుకున్నారు.