లండన్: ఈ యేటి వింబుల్డన్(Wimbledon) టెన్నిస్ విజేతలకు ప్రైజ్‌మనీ పెంచేశారు. తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆటగాళ్లకు పంచనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రైజ్‌మనీ ఈసారి 20 శాతం పెంచారు. సింగిల్స్ విజేతకు 48 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనున్నది. ఇది సుమారు 40 కోట్లు ఉంటుంది. ఇక ఫస్ట్ రౌండ్లో ఓడిన ప్లేయర్‌కు కనీసం 80 వేల పౌండ్లు ఇవ్వనున్నారు. క్వాలిఫయింగ్ కాంపిటీషన్ కోసం సుమారు 6 మిలియన్ల పౌండ్లు ఖర్చు చేస్తున్నారు. దీంట్లో 25 శాతం పెరుగుదల ఉన్నది. ఓవరాల్‌గా ప్రైజ్‌మనీ సుమారు 64.2 మిలియన్ల పౌండ్లుగా ఉంది.
టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా ఆటగాళ పారితోషకాన్ని పెంచామని, ఆటగాళ్లను దీన్ని స్వాగతిస్తారని అనుకుంటున్నాని, ఇది చాలా పెద్ద అమౌంట్ అని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ చైర్ దెబోరా జీవన్స్ తెలిపారు. క్వాలిఫయింగ్ రౌండ్‌తో పాటు అన్ని రౌండ్ల గురించి ఆలోచించామన్నారు. గ్రాండ్‌స్లామ్ నిర్వహణ ద్వారా వస్తున్న ఆదాయంలో 16 శాతం ఆటగాళ్లకు ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రైజ్‌మనీ 9.5 శాతం పెంచారు. కానీ ఆ పెంపు పట్ల చాలా మంది ఆటగాళ్లు నిరాశను వ్యక్తం చేశారు. కొందరు ఆటగాళ్లు నిరసన కూడా చేపట్టారు.
అయితే గత ఏడాది యూఎస్ ఓపెన్ కోసం 20 శాతం ప్రైజ్‌మనీ పెంచారు. ఇక ఈ ఏడాది అమౌంట్‌ను త్వరలో ప్రకటించనున్నారు. గత ఏడాది వింబుల్డన్‌లో జానిక్ సిన్నర్ మెన్స్ చాంపియన్‌గా నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నది.
– Record prize money 🏆
– Investment in facilities ✨
– Support for grass court season🎾The All England Club has announced a series of updates ahead of The Championships 2026.
Find out more ⬇️https://t.co/iEIuO5B7s4
— Wimbledon (@Wimbledon) June 11, 2026