Kane Williamson | అయ్యో విలియమ్సన్.. ఇలా రనౌట్ అయ్యావేంటీ.. వీడియో
Kane Williamson : న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్(Kane Williamson) సెంచరీల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు శతకాలు బాది స్టీవ్ స్మిత్(Steve Smith) రికార్డు సమం చేసిన కేన్ మామ ఆస్ట్రేలియా(Australia)పై అనూహ్య రీతిలో...
Kane Williamson : న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్(Kane Williamson) సెంచరీల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు శతకాలు బాది స్టీవ్ స్మిత్(Steve Smith) రికార్డు సమం చేసిన కేన్ మామ ఆస్ట్రేలియా(Australia)పై అనూహ్య రీతిలో ఔటయ్యాడు. వెల్లింగ్టన్లో జరుగుతున్న తొలి టెస్టులో సింగిల్ తీసే ప్రయత్నంలో రనౌట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో బంతిని ఆడిన విలియమ్సన్ పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. కానీ, బౌలర్ అడ్డుగా ఉండడంతో విల్ యంగ్(Will Young) కొంచెం ఆలస్యంగా స్పందించాడు.
విలియమ్సన్ వేగంగా పరుగెత్తుకు రావడంతో స్టార్క్ పక్కకు తప్పుకున్నాడు. కానీ, యంగ్ కన్ఫ్యూజన్లో విలియమ్సన్‌ను ఢీ కొట్టాడు. అప్పటికే బంతి అందుకున్న మార్నస్ లబూషేన్ వికెట్లను గురి చూసి కొట్టాడు. దాంతో, విలియమ్సన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
Kane Williamson is run out after 12 years in Test cricket. Last time was in January 2012 at Napier against Zimbabwe.pic.twitter.com/GZXFyIL2A7
— Cricketopia (@CricketopiaCom) March 1, 2024
అతడు అలా ఔటవ్వడంతో న్యూజిలాండ్ డగౌట్‌లోని స్టాఫ్‌తో పాటు స్టేడియంలోని అభిమానులంతా షాక్ అయ్యారు. విలియమ్సన్ ఔటవ్వడంతో 12 పరుగులకే రెండో వికెట్ కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న అతడు డగౌట్‌కు చేరడంతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
కేన్ విలియమ్సన్

సుదీర్ఘ ఫార్మాట్లో విలియమ్సన్ రనౌట్ కావడం 12 ఏండ్ల తర్వాత ఇదే మొదటిసారి. జింబాబ్వేతో 2012 జనవరిలో నాపియర్ టెస్టు(Napies Test)లో ఈ స్టార్ ఆటగాడు రనౌట్ అయ్యాడు. పుష్కకార కాలం తర్వాత విలియమ్సన్ మళ్లీ అనూహ్య రీతిలో వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా(South Africa)పై విలియమ్సన్ మూడు శతకాలతో రికార్డులు బద్ధలు కొట్టాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేరిట ఉన్న 32 శతకాల రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియాపై సెంచరీ కొడితే అత్యధిక సెంచరీల వీరుడిగా చరిత్ర సృష్టించేవాడు.
ఇవి కూడా చదవండి
- Hyderabad | డామిట్ కథ అడ్డం తిరిగింది.. పాపులారిటీ కోసం హత్యాయత్నం డ్రామా
- Cancer | పండ్ల వాసనతో క్యాన్సర్ దూరం!
- Newspaper | నాలుగేండ్లకు ఒకసారి వెలువడే పత్రిక.. ఎప్పుడు ప్రారంభించారో తెలుసా?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

