Committed suicide | పురుగుల మందుతాగి యువ రైతు ఆత్మహత్య
Committed suicide | సాగులో దిగుబడి రాక.. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువ రైతు(Young farmer) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు(committed suicide) పాల్పడ్డాడు.
అన్నపురెడ్డిపల్లి, జూలై 25 : సాగులో దిగుబడి రాక.. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువ రైతు(Young farmer) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు(committed suicide) పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువ రైతు మునగాల అశోక్(33) 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మూడేళ్లుగా సొంత ట్రాక్టర్‌తో వ్యవసాయం చేస్తున్నాడు. ఏటా వరి సాగులో సరైన దిగుబడి రాకపోవడం.. వ్యవసాయంలో నష్టం రావడం.. సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో కుటుంబ పోషణ భారమైంది.
ఈ క్రమంలోనే మద్యానికి బానిసయ్యాడు. దీంతో అప్పు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక మంగళవారం ఇంట్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అశోక్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నాయి. యువ రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

