Cancer | పండ్ల వాసనతో క్యాన్సర్ దూరం!
పండ్లు తింటే రోగాలు నయమవుతాయని, దూరమవుతాయని విన్నాం. అంతేకాదు.. పండ్ల వాసన క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోగలదని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. క్యాన్సర్ థెరపీలో వైద్యులు ‘హిస్టోన్ డిఎసిటలేస్ ఇన్హిబేటర్' (హెచ్‌డీఏసీ)ను వాడుతారు. క్యాన్సర్ కణాల వృద్ధి, న్యూరోడిజెనరేటివ్ (పార్కిన్సన్, అల్జీమర్స్.. మొదలైనవి) వ్యాధులను అడ్డుకోవటంలో ఇది ఉపయోగపడుతుంది.
వాషింగ్టన్, ఫిబ్రవరి 29: పండ్లు తింటే రోగాలు నయమవుతాయని, దూరమవుతాయని విన్నాం. అంతేకాదు.. పండ్ల వాసన క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోగలదని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. క్యాన్సర్ థెరపీలో వైద్యులు ‘హిస్టోన్ డిఎసిటలేస్ ఇన్హిబేటర్’ (హెచ్‌డీఏసీ)ను వాడుతారు. క్యాన్సర్ కణాల వృద్ధి, న్యూరోడిజెనరేటివ్ (పార్కిన్సన్, అల్జీమర్స్.. మొదలైనవి) వ్యాధులను అడ్డుకోవటంలో ఇది ఉపయోగపడుతుంది.
అయితే బాగా పండిన పండ్ల నుంచి వెలువడే వాసన కూడా హెచ్‌డీఏసీ మాదిరి ప్రభావం చూపుతున్నదని సైంటిస్టుల ప్రయోగాల్లో తేలింది. పండ్ల వాసన పీల్చినప్పుడు జన్యు వ్యక్తీకరణలో మార్పులు ఉన్నాయని, ఇది క్యాన్సర్, నరాల సంబంధిత వైద్య చికిత్సలో సహాయకారిగా మారుతున్నదని సైంటిస్టులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని ప్రయోగాలు జరపాల్సి ఉందని, ఆవిర్లు, వాసనలకు గురిచేయటం వంటి కొత్త విధానాలు క్యాన్సర్ కణాలపై ఏమేరకు ప్రభావం చూపుతాయన్నది తేలాల్సి ఉందని వారు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఎలుకలు, జంతువులపై ప్రయోగాలు చేస్తున్నట్టు తెలిపారు. మనుషుల్లోని వివిధ అవయవాలకు సోకే క్యాన్సర్‌కు సంబంధించి వైద్య చికిత్సలో ఇది కీలకం అవుతుందని అంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

