న్యూయార్క్: రెండ్రోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ మాజీ సారథి నికోలస్ పూరన్‌కు బంపరాఫర్ దక్కింది. శుక్రవారం (జూన్ 13) నుంచి అమెరికా వేదికగా జరగాల్సి ఉన్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) మూడో సీజన్లో అతడు.. ఎంఐ న్యూయార్క్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు యజమానులుగా వ్యవహరిస్తున్న రిలయన్స్.. న్యూయార్క్ జట్టునూ దక్కించుకున్న విషయం విదితమే. ఎంఎల్సీ 2023 సీజన్లో న్యూయార్క్ తరఫున ఆడిన పూరన్.. 388 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. గత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించకున్నా పూరన్‌పై నమ్మకముంచిన ఎంఐ.. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. న్యూయార్క్ జట్టులో పూరన్‌తో పాటు రషీద్ ఖాన్, పొలార్డ్, డికాక్ వంటి అంతర్జాతీయ స్టార్లు కూడా ఉన్నారు. ఈనెల 13 నుంచి జులై 14 దాకా ఎంఎల్సీ మూడో సీజన్ జరగాల్సి ఉంది.