న్యూఢిల్లీ: ఐసీసీ కొత్త చైర్మెన్‌గా జే షా(Jay Shah) ఎన్నికైన విషయం తెలిసిందే. తన పదవీకాలంలో టెస్టు క్రికెట్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు షా తెలిపారు. క్రికెట్ పురోగతికి అడ్డుగా నిలిచిన అన్ని అవరోధాలను తొలగించనున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ ఒకటో తేదీన గ్రేగ్ బార్క్లే నుంచి ఐసీసీ చైర్మెన్ బాధ్యతలను జే షా స్వీకరించనున్నారు. రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు.
టీ20 క్రికెట్ సహజంగా ఉత్సామభరితమైన ఫార్మాట్ అని, కానీ దానికి సమానంగా టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎందుకంటే క్రికెట్‌కు అదే మూలాధారమైందని షా తెలిపారు. బీసీసీఐ కార్యదర్శి షా.. దీనిపై మంగళవారం ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. లాంగెస్ట్ ఫార్మాట్ క్రికెట్ ఆడేదిశగా క్రికెటర్లను మళ్లించాలని, ఆ దిశగా తమ ప్రయత్నాలు ఉంటాయన్నారు. ట్యాలెంట్ ప్లేయర్ల కోసం ప్రత్యేక ప్రోగ్రామ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆట ప్రమాణాన్ని పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నట్లు షా హామీ ఇచ్చారు. చాలా కీలకమైన బాధ్యతను అప్పగించారని, మీ ఆశయాలకు తగినట్లు, అందమైన క్రికెట్ ఆటకు అంకిత అవుతానని షా తెలిపారు. అక్టోబర్‌లో జరిగే బీసీసీఐ బోర్డు మీటింగ్‌లో ఆయన తన కార్యదర్శి పోస్టును వదులుకునే అవకాశాలు ఉన్నాయి.
ఐసీసీ చైర్మెన్‌గా ఎన్నికైన అయిదు భారతీయుడిగా నిలిచాడతను. గతంలో జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాస్, శశాంక్ మనోహర్.. ఆ హై ప్రొఫైల్ జాబ్ చేశారు.