WI vs PAK | విండీస్ ఆటగాళ్లకు కరోనా.. వన్డే సిరీస్ వాయిదా వేసిన పాక్
WI vs PAK | పాకిస్తాన్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు వెళ్లిన విండీస్ బృందాన్ని కరోనా భూతం పట్టుకుంది. కరాచీలో విమానం దిగీ దిగగానే చేసిన కరోనా టెస్టుల్లో ముగ్గురు ఆటగాళ్లు, సహాయక సిబ్బందిలో ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలారు.

పాకిస్తాన్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు వెళ్లిన విండీస్ బృందాన్ని కరోనా భూతం పట్టుకుంది. కరాచీలో విమానం దిగీ దిగగానే చేసిన కరోనా టెస్టుల్లో ముగ్గురు ఆటగాళ్లు, సహాయక సిబ్బందిలో ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో వాళ్లందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. పాక్‌తో సిరీస్ జరుగుతుందా? అని అనుమానాలు వచ్చాయి.
అయితే ఈ అనుమానాలు, భయాలను పక్కనపెట్టి టీ20 సిరీస్ ఆడారు. మూడో టీ20 మ్యాచ్ ముందు కొవిడ్-19 ప్రోటోకాల్స్‌లో భాగంగా మరోసారి అందరికీ కరోనా టెస్టులు చేశారు. వీటిలో విండీస్ బృందంలో మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో మూడో టీ20 మ్యాచ్ ఆడిన తర్వాత.. వన్డే సిరీస్‌ను వాయిదా వేయాలని రెండు దేశాల బోర్డులు నిర్ణయించాయి.
ఈ మేరకు సంయుక్తంగా అధికారిక ప్రకటన చేశాయి. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సిరీస్ ఆడతామని ఇరుబోర్డులు తెలిపాయి. కాగా, మూడో టీ20 తర్వాత కరోనా నెగిటివ్ వచ్చిన విండీస్ ఆటగాళ్లందరూ స్వదేశానికి బయలుదేరనున్నారు. కరోనా సోకిన ఆటగాళ్లు మాత్రం కరాచీలోనే తమ క్వారంటైన్ పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణమవుతారు. కరోనా నెగిటివ్ వచ్చిన పాక్ ఆటగాళ్లు కూడా బయోబబుల్ వీడతారని సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

