వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. విండీస్‌లో జరిగే టీ20 మ్యాచులన్నీ కూడా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావలసి ఉంది. అయితే తొలి మ్యాచ్ జరిగిన ట్రినిడాడ్ నుంచి జట్లకు సంబంధించిన కీలకమైన లగేజ్ రావడం ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా మ్యాచ్‌ను మరో రెండు గంటలు ఆలస్యంగా మొదలు పెట్టాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలోనే రెండో టీ20 మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవనుంది. భారత కాలమానం ప్రకారం అయితే రాత్రి 8 గంటలకు మొదలవ్వాల్సిన మ్యాచ్.. రాత్రి 10 గంటలకు ప్రారంభం అవుతుంది. సోమ, మంగళవారాల్లో వరుసగా టీ20 మ్యాచులు ఆడిన తర్వాత.. భారత జట్టు అమెరికా వెళ్తుంది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో చివరి రెండు టీ20లు ఆడుతుంది.
Due to delays in team luggage arriving into St Kitts from Trinidad, today’s #WIvIND T20I will have a delayed start
The match is now scheduled to start at 12:30pm local time (10pm IST) pic.twitter.com/RRw8xvI7u0
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2022