వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. టీ20 సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. బుమ్రా, కోహ్లీ వంటి వెటరన్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో జట్టును గెలిపించే బాధ్యతను రోహిత్ శర్మ తన భుజాలపై వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ట్రినిడాడ్‌లోని బ్రయాన్ లారా స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ సారధి నికోలస్ పూరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఇంగ్లండ్‌లో చేసినట్లే రోహిత్ శర్మతో కలిసి రిషభ్ పంత్ జట్టు ఓపెనింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. గాయం నుంచి కోలుకున్న జడేజా కూడా జట్టుతో చేరగా.. చాలా రోజుల తర్వాత టీ20 ఫార్మాట్లో అశ్విన్ ఆడుతున్నాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్షదీప్ సింగ్
🚨 Here's #TeamIndia's Playing XI 👇
Follow the match ▶️ https://t.co/qWZ7LSCVXA #WIvIND pic.twitter.com/F5lu3EZy3N
— BCCI (@BCCI) July 29, 2022